- Advertisement -
హైదరాబాద్: గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో శక్తి పంప్స్ 23 శాతం వృద్ధితో రూ.110.23 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.89.67 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.610.13 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ4లో రూ.669.76 కోట్లకు పెరిగిందని ఆ కంపెనీ చైర్మెన్ దినేష్ పటిదర్ తెలిపారు. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 2024-25లో తాము రూ.2,516.6 కోట్ల అత్యధిక రెవెన్యూ సాధించామన్నారు.
- Advertisement -