అర్హులైన వారిని గుర్తించి గృహలక్ష్మి ఇవ్వాలి

– బాలాజీ నగర్‌ గ్రామస్తులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
అసలైన అర్హులైన వారిని గుర్తించి గహలక్ష్మి ఇవ్వాలని బాలాజీ నగర్‌ పంచా యతీ మహిళలు అన్నారు. శనివారం బాలాజీ నగర్‌ మరియు సంత గూడెం గ్రామానికి చెందిన మహిళలు గహలక్ష్మి అనర్హులకు కేటాయించారంటూ జిల్లా కల ెక్టర్‌ మరియు మండల తహసిల్దార్‌ అల్లం రాజకుమార్‌ కు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మహిళలు మాట్లాడుతూ బాలాజీ నగర్‌ గ్రామపంచాయతీ పరిధిలో పదిమందికి గహలక్ష్మి పేర్లు ప్రకటించగా వీరిలో ముగ్గురు మాత్రమే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని మిగతా ఏడుగురికి గతంలోనే మంచి గహాలు కలిగి ఉన్నారని అన్నారు. అధికారులు సర్వే జరిపినప్పుడు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు కనిపించలేదా అని మహిళలు ప్రశ్నించారు. మేము సర్వే మాత్రమే చేశామని ఎంపిక చేసింది మేము కాదని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సర్వే అధికారులు చేస్తే ఎంపిక టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేశారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్లు తెరిచి గతంలో పక్కా గహాలు ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించి వారి స్థానంలో అర్హులైన వారికి గహలక్ష్మి వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రేపటి రోజున ఓట్లు ఎలా అడుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు నాగావత్‌ జ్యోతి పాడియా కవిత అజ్మీర లలిత భూక్య శారద అజ్మీర రాజి బానోత్‌ సమ్మక్క హాట్కర్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.

Spread the love