Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'దొంగ-పోలీస్' ఆట.. అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు

‘దొంగ-పోలీస్’ ఆట.. అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. అత్త కనకమహాలక్ష్మిని కోడలే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ‘దొంగ-పోలీస్’ ఆట పేరుతో అత్తను కుర్చీకి కట్టేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి, అగ్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. లోతైన విచారణలో అసలు విషయం బయటపడగా, తనపై చిరాకు పడుతున్నారనే కారణంతోనే అత్తను హతమార్చినట్లు కోడలు అంగీకరించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -