- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చిత్తూరుకు చెందిన వ్యక్తి కొరియాలో మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. తాజాగా, ఈ చిత్ర టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో ‘లోఫర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి వరుణ్ తేజ్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు.
- Advertisement -



