Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకెపి, వివోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి 

ఐకెపి, వివోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి 

- Advertisement -

తెలంగాణ ఐ.కె.ప వివో ఎల రాష్ట్ర సహాయ కార్యదర్శి వెలిశాల సుధాకర్ 
నవతెలంగాణనెల్లికుదుర

ఐకెపి, వివో ఎల సమస్యను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించి, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచి ఇవ్వాలని తెలంగాణ ఐకెపి వివో ఏల రాష్ట్ర సహాయ కార్యదర్శి వెలిశాల సుధాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఐకెపి, మండల సమైక్య కార్యాలయం వద్ద ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐకెపి, వివోఏలకు ప్రభుత్వం రూ.18 వేల వేతనం ఇవ్వాలని, రూ.10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించి, సర్ఫ్ నుండి ఇచ్చిన  సర్వులర్ ప్రకారం గ్రామ సంఘం నుండి వేతనాలు పెంచాలన్నారు. ప్రతి గ్రామ సంఘానికి క్యూట్ నెట్టు సౌకర్యం కల్పించాలనీ, ఆదాయం లేని గ్రామ సంఘాలకు రూ.20 లక్షల స్పెషల్ ఫండ్ ఇవ్వాలని అందించి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. గత 20 ఏండ్లుగా సెర్ఫ్ సంస్థలో పనిచేస్తూ.. మహిళల కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడానికి అహర్నిషలు శ్రమించామన్నారు. రాష్ట్ర యూనియన్ తో సెర్ఫ్ సీఈవో చర్చలు జరిపి తనకు కొన్ని స్పష్టమైన హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు గుగులోతు హనుమంతు, కార్యదర్శి ఇందిర, గడ్డల అశోక్ ,రమేష్, హైమావతి, ఉపేందర్, శ్రీను, రాము, ఉషారాణి, కవిత ,విజయలక్ష్మి ,తో పాటు కొంతమంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -