Monday, July 13, 2026
E-PAPER
Homeజిల్లాలు పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

 పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

- Advertisement -

టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ 
నవతెలంగాణ-నెల్లికుదురు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 వేల సర్కార్ బడులను 4 వేలకు కుదించడమంటే పేద పిల్లలను చదువులకు దూరం చేసినట్టే అని, ఈ పాఠశాలల మూసివేత నిర్ణయం సరైంది కాదనీ, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో పలు పాఠశాలలను సందర్శించిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు గడుస్తున్నా ఇంకా పీఆర్సీని అమలుచేయకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగసంఘాలతో చర్చించి, ఆమోదయోగ్యమైన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా డీఏలను అమలుచేయాలని కోరారు. గ్రామాల్లోని ప్రాథమీక పాఠశాలల్లో తరగతికొక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందే అన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ నెల్లికుదురు మండల ప్రధానకార్యదర్శి కోట జనార్ధన్, మండల నాయకులు భాస్కర్, రవి, దుర్గయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -