నవతెంగాణ – హైదరాబాద్ : లార్డ్స్‌లో టీమ్‌ఇండియా మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. లార్డ్స్‌లో జరిగిన మొదటి మహిళల టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌పై 270 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మొత్తంగా ఐదురోజులపాటు జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లలో షఫాలీ వర్మ డకౌట్ కాగా.. స్మృతి మంధాన అర్ధ శతకం(83)తో మెరిసింది.కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(58), దీప్తి శర్మ(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగిలిన వారిలో జెమీమా రోడ్రిగ్స్ (35) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో170పరుగులకే కుప్పకూలింది.వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ అర్ధ శతకం (52) తో రాణించడంతో ఈ మాత్రం స్కోరు చేసింది. క్రాంతికి ఐదు వికెట్లు, సయాలీ సత్ఘరే, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం(115పరుగులు)కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్..ఏడు వికెట్ల నష్టానికి 341/7పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా సెంచరీ(113) చేసింది. స్మృతి మంధాన (70), షఫాలీ వర్మ (33), జెమీమా రోడ్రిగ్స్3, హర్మన్‌ప్రీత్ కౌర్ (16), దీప్తి శర్మ(10), రిచా ఘోష్(50), స్నేహ రాణా1, సయాలీ సత్‌ఘరే 18 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆదివారం నాటి నాలుగో రోజు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ కేవలం130పరుగులు చేసింది.
ఈ క్రమంలో130/6 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి చివరి రోజు ఆట మొదలుపెట్టిన ఇంగ్లండ్.. మరో56 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లిస్టోన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకుంది. యాభై పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె పదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరింది. దీంతో భారత్ 270పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయాలీ సత్ఘరే, క్రాంతి గౌడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు.



