Monday, July 13, 2026
E-PAPER
Homeజాతీయంగోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

గోవధ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆవులు, దూడల వధపై మద్రాస్ హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలకు సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. బక్రీద్ సందర్భంగా మాత్రమే కాకుండా ఏ రోజూ రాష్ట్రంలో ఆవులు, దూడలను వధించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

1958 తమిళనాడు జంతు సంరక్షణ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు సంపూర్ణ నిషేధం విధించిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ చట్టం ప్రకారం 10 ఏండ్ల దాటిన లేదా వ్యవసాయం, సంతానోత్పత్తికి పనికిరాని పశువులకు సంబంధిత అధికారుల ధ్రువీకరణతో వధకు అనుమతి ఉందని ప్రభుత్వం వాదించింది. అలాంటి చట్టపరమైన వెసులుబాట్లు ఉన్నప్పటికీ అన్ని సందర్భాల్లోనూ వధను పూర్తిగా నిషేధించడం చట్ట పరిధిని మించిపోయిన చర్య అని పేర్కొంది.

వాదనలు విన్న సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులకు ‘‘సవరణ అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదుల నుంచి సమాధానం కోరుతూ విచారణను వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -