Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంహస్తినలో భారీ విస్ఫోటనాలివీ…

హస్తినలో భారీ విస్ఫోటనాలివీ…

- Advertisement -

జనవరి 9, 1997: ఢిల్లీలోని ఐటిఓ ప్రాంతంలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఎదురుగా జరిగిన బాంబు పేలుళ్లలో 50 మందికి గాయాలు
అక్టోబర్‌ 1, 1997: సదర్‌ బజార్‌ ప్రాంతంలో ఊరేగింపు సమీపంలో జరిగిన రెండు బాంబు పేలుళ్లలో 30 మందికి గాయాలు
అక్టోబర్‌ 10, 1997: శాంతివన్‌, కౌరియా పుల్‌, కింగ్స్‌వే క్యాంప్‌ ప్రాంతాల్లో జరిగిన మూడు బాంబు పేలుళ్లలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు
అక్టోబర్‌ 18, 1997: రాణి బాగ్‌ మార్కెట్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో ఒకరు మృతి, 23 మందికి గాయాలు
అక్టోబర్‌ 26, 1997: కరోల్‌ బాగ్‌ మార్కెట్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో ఒకరు మృతి. 34 మందికి గాయాలు
నవంబర్‌ 30, 1997: ఎర్రకోట ప్రాంతంలో జరిగిన జంట పేలుళ్లలో ముగ్గురు మృతి. 70 మందికి గాయాలు
డిసెంబర్‌ 30, 1997: పంజాబీ బాగ్‌ సమీపంలో ఒక బస్సులో జరిగిన బాంబు పేలుడులో నలుగురు మృతి. 30 మందికి గాయాలు
జూలై 26, 1998: ఇంటర్‌-స్టేట్‌ బస్‌ టెర్మినల్‌ (ఐఎస్‌బిటి) కాశ్మీరీ గేట్‌ వద్ద నిలిపి ఉన్న బస్సులో జరిగిన భారీ పేలుడులో ఇద్దరు మృతి. ముగ్గురికి గాయాలు
జూన్‌ 18, 2000: ఎర్రకోట సమీపంలో జరిగిన రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లలో ఎనిమిదేళ్ల బాలికతో సహా ఇద్దరు మృతి. 15 మందికి గాయాలు
మే 22, 2005: ఢిల్లీలోని రెండు సినిమా హాళ్లలో జరిగిన వరుస పేలుళ్లలో ఒకరి మృతి. 60 మందికి గాయాలు.
అక్టోబర్‌ 29, 2005: సరోజినీ నగర్‌, పహార్‌గంజ్‌ మార్కెట్‌లను కుదిపేసిన మూడు పేలుళ్లలో 59 మంది మృతి. 100 మందికి పైగా గాయాలు. ఇదే రోజున ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతం వద్ద బస్సులో జరిగిన పేలుడులో ఒకరికి గాయాలు
ఏప్రిల్‌ 14, 2006: పాత ఢిల్లీలోని ప్రాకార నగరంలోని జామా మసీదు ప్రాంగణంలో జరిగిన రెండు పేలుళ్లలో 14 మందికి గాయాలు
సెప్టెంబర్‌ 13, 2008: దక్షిణ ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌, కరోల్‌ బాగ్‌లోని గఫర్‌ మార్కెట్‌, గ్రేటర్‌ కైలాష్‌-1లోని ఎం-బ్లాక్‌ మార్కెట్‌ల్లో 45 నిమిషాల వ్యవధిలో జరిగిన ఐదు వరుస పేలుళ్లలో 25 మంది మృతి. 100 మందికి పైగా గాయాలు
సెప్టెంబర్‌ 27, 2008: కుతుబ్‌ మినార్‌ సమీపంలోని మెహ్రౌలీ పూల మార్కెట్‌ వద్ద పేలుడులో ముగ్గురు మృతి. 21 మందికి గాయాలు
మే 25, 2011: ఢిల్లీ హైకోర్టు వద్ద కార్‌ పార్కింగ్‌లో స్వల్ప పేలుడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -