Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్షకులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు

ప్రేక్షకులందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు

- Advertisement -

అఖిల్‌ రాజ్‌, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్‌ టచింగ్‌ లవ్‌ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్‌ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్‌, మాన్‌ సూన్స్‌ టేల్స్‌ బ్యానర్స్‌ పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకొచ్చారు. ఈ సినిమా విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ను మేకర్స్‌ ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్‌ సాయిలు కంపాటి మాట్లాడుతూ, ‘మా మూవీ సక్సెస్‌తో మాటలు రావడం లేదు. నాకు ఈ వేదికను, ఈ సక్సెస్‌ను ఇచ్చిన క్రెడిట్‌ ఈటీవీ విన్‌ సాయి, నితిన్‌దే. సినిమా మీద ప్యాషన్‌ ఉన్న ఇలాంటి వాళ్లు ఉంటే ఎంతోమంది కొత్త వాళ్ల జీవితాలు బాగుపడతాయి’ అని తెలిపారు.

‘ఈ స్టోరీ థియేటర్స్‌లో ప్రేక్షకులకు నచ్చుతుంది అని మేము పెట్టుకున్న నమ్మకం నిజమైంది’ అని ప్రొడ్యూసర్‌ రాహుల్‌ మోపిదేవి అన్నారు. ప్రొడ్యూసర్‌ వేణు ఊడుగుల మాట్లాడుతూ,’ఈ సినిమా చివరి 30 నిమిషాలు హార్డ్‌ హిట్టింగ్‌గా ఉంటుందని మేము ప్రమోషన్‌లో చెబితే అది పబ్లిసిటీ స్టంట్‌ అని కొందరు అన్నారు. అలా అన్న వారే ఇప్పుడు మంచి సినిమా అని అంటున్నారు. మా సినిమా ఎమోషనల్‌గా ఉంది, మైండ్‌ బ్లోయింగ్‌గా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. రివ్యూస్‌ పాజిటివ్‌గా వస్తున్నాయి’ అని తెలిపారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ వంశీ నందిపాటి మాట్లాడుతూ,’ప్రతి ఒక్కరూ కథకు రిలేట్‌ అవుతున్నారు. ఎమోషనల్‌ అవుతున్నారు’ అని అన్నారు. ‘ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఓన్‌ చేసుకుంటున్నారు. ప్రేమలో ఉన్న అమ్మాయి, అబ్బాయి, ఆ ప్రేమను వద్దనే తండ్రి ప్రతి ఒక్కరూ ఈ కథకు కనెక్ట్‌ అవుతున్నారు. సినిమా కంటెంట్‌ ను జడ్జ్‌ చేయడంలో మేమంతా మరోసారి సక్సెస్‌ అయ్యాం’ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ బన్నీ వాస్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -