Sunday, July 26, 2026
E-PAPER
Homeజాతీయంఆ మార్గంలో ఢిల్లీ మెట్రో సేవలు పునరుద్ధరణ

ఆ మార్గంలో ఢిల్లీ మెట్రో సేవలు పునరుద్ధరణ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: జెన్ జీ ఆందోళనలతో ఢిల్లీలోని జంతర్ మంతర్ నినాదాలతో మారు మోగింది. వివిధ రాష్ర్టాల నుంచి భారీగా తరలివచ్చిన యువత సీజేపీ తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ ను విజయవంతం చేశారు. పోలీసుల నిర్భందాన్ని చేధించుకుంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని భీష్మించారు. అయితే జంతర్ మంతర్ కు యువత రాకుండా మోడీ ప్రభుత్వం అనేక అడ్డుంకులు సృష్టించింది. పార్లమెంట్ తో పాటు జంతర్ మంతర్ కు చేరుకునే పలు మెట్రో మార్గాలను మూసివేసింది. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవీకి రాజీనామా చేయడంతో యువత ఆందోళనలు విరమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మూసివేసిన ఆయా మెట్రో మార్గాలను పునరుద్దరించారు. ఢిల్లీలోని 18 కీలక స్టేషన్లలో ప్రయాణీకుల సేవలకు తిరిగి తెరుచుకున్నాయి.ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌లోని అన్ని స్టేషన్లు ప్రయాణీకుల సేవలకు అందుబాటలో ఉన్నాయి” అని డీఎంఆర్‌సీ Xలో ఒక పోస్ట్‌లో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -