తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ ఈ నెల 6న జరగ నున్నాయి. ఈ నేపథ్యంలో ప్రోగ్రె సివ్ ప్యానెల్ తమ మేనిఫెస్టోను మీడియా ద్వారా ప్రకటించింది. నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, ‘అవసరంలో ఉన్న నిర్మాతలకు వైద్య సహాయం, అత్య వసర సహాయం అందించడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. అర్హత కలిగిన ప్రతి సభ్యుడికి రూ.5 లక్షల క్యాష్‌లెస్ వైద్య సదుపాయం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న నిర్మాతల కోసం రూ.50 లక్షల ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేస్తాం. అన్యువల్ మెంబర్స్‌గా దాదాపు 300 మంది ఉన్నారు. వారందరికీ వన్‌టైమ్ మినిమం ఫీజు నిర్ణయిం చి, వారిని రెగ్యులర్ మెంబర్స్‌గా చేస్తాం. కొత్త నిర్మాతలను ప్రోత్స హించడానికి సింగిల్ విండో ప్రొడ్యూసర్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తాం. వారికి గైడెన్స్ ఇవ్వడానికి ఒక హెల్ప్ డెస్క్, అలాగే కథ విషయంలో కూడా గైడెన్స్ ఇవ్వ డానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. మహిళా భద్రతకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్‌లలో పాటించాల్సిన నిబంధనలను అమలు చేసే బాధ్య తతోపాటు. కార్మిక సంఘాలతో ఏవైనా సమస్య లు వచ్చినా నిర్మా తలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తాం. అన్నింటికిమించి ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అందరినీ సమానంగా చూడాలనే విధానాన్ని ఒక చట్టంలా చేయాల నేది మా ఉద్దేశం’ అని అన్నారు. ‘మా ప్యానెల్ నుంచి నిర్మాతలం దరికీ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుం ది. మేము నైజాంలో 18 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాము. అందులో చాలా సినిమాలు చిన్న సినిమాలే. రిలీజ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న సినిమాలు దాదాపు వంద వరకు ఉన్నాయి. మేము చిన్న నిర్మాతల వైపు నిలబడతాం. సినిమాను రిలీజ్ చేసుకునే భరోసా మేము ఇప్పించగలం’ అని నిర్మాత రవిశంకర్ తెలిపారు.
ప్రతి సభ్యుడికి రూ.50 లక్షల ఎమర్జెన్సీ ఫండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



