క్రియేటివ్ లాంచ్ పాడ్ బ్యానర్ పై సంకీర్త్ కొండ నిర్మించిన చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. దర్శకుడు ప్రీతం మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో సంగీతం, డైలా గ్స్ ప్రత్యేక ఆకర్షణ. టీజర్‌లో విన్న మ్యూజిక్ కంటే సినిమాలో మరింత అద్భుతంగా ఉంటుం ది. విజయ్ రాజ్ కుమార్ అత్య ద్భుతమైన కథ రాశారు’ అని తెలిపారు. ‘ఈ సినిమా వెనుక సంకీర్త్ కొండ కీలక పాత్ర పోషించారు. నేను కేవలం 10 నిమిషాల ఫోన్ కాల్‌లో కథ చెప్పగానే సంకీర్త్ సినిమా నిర్మించడానికి ముందు కొచ్చారు. టీజర్‌లో కూడా ‘బిలీవ్డ్ బై సంకీర్త్ కొండ’ అని ప్రత్యేకంగా పేర్కొన్నాం. ఇప్పటి వరకు ఎవరూ సాహసించని కథ ఇది. సినిమాను భారీగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో టైటిల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేం దుకు ముందుగానే పలు కార్య క్రమాలు నిర్వహించాం. ఫస్ట్ కాపీ చూసి నిర్మాత సినిమాను మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు’ అని నటుడు విజయ్ రాజ్ కుమార్ అన్నారు.
ఎవరూ సాహసించని కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



