రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’. ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియే షన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. రిత్విక్ కుమార్ దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రంలోని ‘నీ పరిచయం..’ పాటను రిలీజ్ చేశారు. గీత రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ,‘ప్రేమ, ఆర్తి, అక్కెరతో కూడుకున్న ఈ పాట ను అత్యద్భుతంగా కంపోజ్ చేసిన అనూప్ కి, అంతే అద్భుతంగా పాడిన చిన్మయికి ధన్యవాదాలు’ అని అన్నారు. ‘ఈ సాంగ్ మా మూవీకి పిల్లర్ లాంటిది. ఎమోషనల్ గా సాగే ఈ పాట మీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని నిర్మా తలు తెలిపారు. అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను’ అని అన్నారు. ‘ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉన్న ఈ థ్రిల్లర్ సినిమాలో లవ్ ఎలిమెం ట్ తీసుకొచ్చి దాన్ని టర్న్ చేస్తూ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లే క్యారెక్టర్ చేశారు రాజ్ తరుణ్. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ఫ్లస్ పాయింట్’ అని డైరెక్టర్ రిత్విక్ కుమార్ చెప్పారు. హీరో రాజ్ తరుణ్ మాట్లా డుతూ, ‘మా మూవీ ఒక యూనిక్ థ్రిల్లర్’ అని అన్నారు.
యూనిక్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



