డైరెక్టర్ బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కాకా’ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ ప్రారంభం అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగారిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి షూటింగ్ లొకేషన్ లో డిస్కస్ చేస్తూ కనిపించారు. 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అనశ్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీనుతదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: తమన్, డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటర్: ఆంటోనీ రూబెన్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా.
‘కాకా’ కోసం భారీ షెడ్యూల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



