జయశ్రీ మీడియా సమర్పణలో తెర కెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణం భజే’. కలాల్ శ్రీనివాస్ నిర్మాత. నాగరాజ్ కొట్టే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో లాంచ్ చేశారు. బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.పౌరాణిక, భక్తిరస అంశాలను మేళ విస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగరాజ్ కొట్టే రచనతో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. కథకు అనుగుణంగా ప్రత్యేకమైన పాత్రలు, ఆసక్తికరమైన సన్నివేశా లతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రదీష్, వంగమయి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకి సంభా షణలు : రచ్చ రవి, సహ నిర్మాత: శ్రీరాం గుప్త, సినిమాటో గ్రఫీ: . రాము సి.ఎం – సూర్య మీసాల, సంగీతం: మం థెన త్రినాథ్ – సత్య సొమేష్, ఎడిటర్: జి. రాకేష్ గౌడ్.
భిన్నంగా ‘కృష్ణంభజే’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



