Friday, September 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుథియేటర్ల మనుగడ కోసం..

థియేటర్ల మనుగడ కోసం..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్‌కు విజయవాడలో ఎగ్జిబిటర్లు ఘన స్వాగతం పలికి, సత్కరించారు. అనంతరం రాష్ట్రంలోని థియేటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భరత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రఫీ తదితర శాఖల లైసె న్సుల గడువులు వేర్వేరుగా ఉండటంతో ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని శాఖలకు ఒకే విధంగా 5 ఏళ్ల కాలపరిమితి తో సింగిల్ విండో విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.
ఎగ్జిబిటర్ల సమస్యలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడామని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉందని ఆయన తెలిపారు. ఎఫ్‌డీసీలో ఎగ్జిబిటర్లు మెంబర్‌షిప్ తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిటర్లందరూ కలిసి ఉంటే తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం మరింత సులభమవుతుందని, రాష్ట్రంలో ప్రస్తుతం 1,197 మంది ఎగ్జిబిటర్లను గుర్తించామని, ప్రతి ఎగ్జిబిటర్ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని భరత్ భూషణ్ పేర్కొన్నారు. కేవలం టికెట్ ధరలు పెంచడం ఒక్కటే పరిష్కారం కాదని, థియేటర్ల నిర్వహణ, వ్యాపారం సజావుగా కొనసాగేందుకు అవసరమైన పరిస్థితులను కల్పించడం కూడా ముఖ్యమని ఆయన చెప్పారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2,000కు పైగా థియేటర్లు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 1,200కు పడిపోయిందని భరత్ భూషణ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -