Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅంతకుమించి..

అంతకుమించి..

- Advertisement -

ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్‌ సిసిల్‌, హేమ, సత్యం రాజేశ్‌, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘త్రీ రోజెస్‌’. ఆహా ఓటీటీలో సూపర్‌ హిట్‌ అయిన ఈ సిరీస్‌ సీజన్‌ 2 డిసెంబర్‌ 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ఈ సిరీస్‌ను మాస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ఎస్‌కేఎన్‌ నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌ మారుతి షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. రవి నంబూరి, సందీప్‌ బొల్ల రచన చేయగా..కిరణ్‌ కె కరవల్ల దర్శకత్వం వహించారు. తాజాగా సీజన్‌ 2 టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలోఆహా కమర్షియల్‌ హెడ్‌ రాజేశ్‌ వాసిరెడ్డి, ఆహా కంటెంట్‌ హెడ్‌ కవిత, రైటర్‌ సందీప్‌ బొల్ల, యాక్టర్‌ సూర్య శ్రీనివాస్‌, డైరెక్టర్‌ కిరణ్‌ కె కరవల్ల, హీరోయిన్‌ కుషిత కల్లపు, హీరోయిన్‌ రాశీ సింగ్‌, హీరోయిన్‌ ఈషా రెబ్బా తదితరులు పాల్గొని, ఈ సిరీస్‌ విజయం పట్ల తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నిర్మాత ఎస్‌ కేఎన్‌ మాట్లాడుతూ,’త్రీ రోజెస్‌’ కాన్సెప్ట్‌తో ఎన్ని సిరీస్‌లు అయినా చేయొచ్చు. అలాంటి యూనిక్‌ కాన్సెప్ట్‌ మారుతి ఇచ్చారు. ‘టాక్సీవాలా’ మూవీ చేశాక ఓటీటీలో ఏదైనా కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేసేందుకు కావాల్సినంత కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది ”త్రీ రోజెస్‌”. సీజన్‌ 1ను మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సీజన్‌2లో చూస్తారు. ఈ సిరీస్‌లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ను సందీప్‌ క్రియేట్‌ చేశాడు. డైరెక్టర్‌గా కిరణ్‌ క్రియేటివిటీలో ఈ సీజన్‌ 2 కేవలం10శాతం మాత్రమే. తన ప్రతిభను ఫ్యూచర్‌లో చూస్తారు. నా సినిమాల్లో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్‌ చేస్తూ వెళ్తున్నాను. మంచి కంటెంట్‌ ఉంటే వెంటనే ఓకే చెప్పి సపోర్ట్‌ చేసే ఓటీటీ ఆహా. డిసెంబర్‌ 12న సీజన్‌ 2 చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -