- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా అహిల్యానగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం సుమారు 50 మంది విద్యార్థులతో వెళ్తున్న ఒక పాఠశాల బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది పిల్లలు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు.
- Advertisement -



