నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్‌కు అలాగే సాయి పటేల్ లను మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం చేశారు. నిజాంసాగర్ మండలానికి చెందిన మల్లికార్జున్ ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో, సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, మిర్జాపుర్ హనుమాన్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్, హన్మాండ్లు స్వామి, మాజీ సొసైటీ చైర్మన్ కొండ గంగాధర్, విట్టల్ గురిజి, సంగయ్యప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.
నాయకులు నూతన డీసీసీ చీఫ్ మల్లికార్జున్‌కి, అలాగే అభినందనలు తెలిపిన సాయి పటేల్ ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని స్థాయిలో మరింత బలపరిచే దిశగా అందరం కలిసి కృషి చేయాలని సంకల్పించారు. మల్లికార్జున్ జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడం ద్వారా పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం, కొత్త దిశ లభిస్తుందని అభిప్రాయపడ్డారు.జిల్లా అభివృద్ధి, పార్టీ విస్తరణకు మల్లికార్జున్ నాయకత్వం తోడ్పడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు.



