నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులోని వైష్ణవి ఆసుపత్రి సమీపంలోని శానిటేషన్ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్ మున్సిపల్ సిబ్బందితో మాట్లాడుతూ.. పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించి చెత్త ఉండకుండా వెంటనే శుభ్రత పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇంటింటి చెత్తను ప్రతీ రోజూ సేకరించాలని, ఎక్కడైనా చెత్త పేరుకు పోకుండా రోజువారీ పర్యవేక్షణ చేయాలని, ఆసుపత్రులు, రహదారులు, ప్రజలు ఎక్కువగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో శుభ్రత చర్యలు చేపట్టాలని, చెత్త సేకరణలో నిర్లక్ష్యం చేయకుండా పౌరుల ఆరోగ్యం, శుభ్రమైన పర్యావరణం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలంటూ, స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధన కోసం మున్సిపాలిటీ పూర్తి నిబద్ధతతో పని చేయాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఫర్వేజ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
శానిటేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



