– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ ప్రచారం
నవతెలంగాణ-కామేపల్లి
మరోసారి ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ అన్నారు. శుక్రవారం కామేపల్లి మండలంలో ఎమ్మెల్యే హరిప్రియ సుడిగాలి పర్యటన చేసి గడపగడపకు ప్రచారం చేశారు. హరిప్రియకు కామేపల్లి మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కామేపల్లి మండలంలోని మద్దులపల్లి, సుఖితాండ, నారాయణపురం, శాతన గూడెం, జగన్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కోలాటం బందంతో భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి ప్రచారం నిర్వహించడంతో గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ ఆ అభివద్ధి చేశాను.. ఆశీర్వదించండి.. మరోసారి అభివద్ధి ఏంటో చూపిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ గెలుపుకు నాంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానో సునీత రాందాస్ నాయక్, బీఆర్‌ఎస్ పార్టీ కామేపల్లి మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఆంతోటి అచ్చయ్య, ఎంపీటీసీ సామా మోహన్‌రెడ్డి, గబురు నాయక్, మాజీ సర్పంచ్ రాకేష్ రాంబాబు, కేళోత్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హరిప్రియ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు
కామేపల్లి మండల పరిధిలోని బాసిదినర్ గ్రామపంచాయతీలో గల పూసలతండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీిఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా చేరిన వారు మాట్లాడుతూ అభివద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్‌ఎస్ పార్టీలో చేరినామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ అందరికీ అండగా ఉంటానని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానో సునీత రాందాస్ నాయక్, బీఆర్‌ఎస్ పార్టీ కామేపల్లి మండల అధ్యక్షులు ధనియాకుల హనుమంతరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ఆంతోటి అచ్చయ్య, ఎంపీటీసీ గబురు నాయక్, మాజీ సర్పంచ్ రాకేష్ రాంబాబు కేళిత్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.