Saturday, July 5, 2025
E-PAPER
Homeసినిమాసూర్య నయా సినిమా షురూ..

సూర్య నయా సినిమా షురూ..

- Advertisement -

సూర్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సూర్య నటిస్తున్న 46వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.33గా తెరకెక్కనున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
‘సార్‌/వాతి’, ‘లక్కీ భాస్కర్‌’ వంటి అద్భుతమైన సినిమాలతో దర్శకుడు వెంకీ అట్లూరి వరుస ఘన విజయాలను సొంతం చేసుకుని ప్రేక్షకుల హదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు మరో అద్భుతమైన కథతో అలరించడానికి సూర్యతో చేతులు కలిపారు.
తెలుగునాట సూర్యకు ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కెరీర్‌ను మలుపుతిప్పిన ‘గజిని’ సినిమా నుంచి భారీ స్థాయిలో అభిమానులను ఏర్పరచుకున్నారు. పాత్రలు, కథల ఎంపికలో వైవిధ్యం చూపించే సూర్య.. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తదనంతో అందిస్తూనే ఉంటారు. తాజా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి సన్నద్ధమవుతున్నారు.
‘ప్రేమలు’ చిత్రంతో యువతకు చేరువైన యువ సంచలనం మమిత బైజు కథానాయికగా నటిస్తుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కాగా, ఈ చిత్రంతో రవీనా టాండన్‌ తెలుగు సినిమాల్లోకి పునఃప్రవేశం చేస్తున్నారు. సీనియర్‌ నటి రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల ‘సార్‌, లక్కీ భాస్కర్‌, అమరన్‌, వీర ధీర సూరన్‌’ చిత్రాలకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించి విలక్షణమైన సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు జి.వి.ప్రకాష్‌ కుమార్‌. ఇప్పుడు వెంకీ అట్లూరితో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వెంకీ అట్లూరి గత చిత్రాలు ‘సార్‌, లక్కీ భాస్కర్‌’ విజయాల్లో జి.వి.ప్రకాష్‌సంగీతం కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాబోయే సూర్య చిత్రంలో భావోద్వేగం, మాస్‌ అప్పీల్‌ను మిళితం చేసే సౌండ్‌ట్రాక్‌తో ఆ హిట్‌ ట్రెండ్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు.
త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. భారీ అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించడానికి చిత్ర బందం సన్నాహాలు చేస్తోంది.
సూర్య, మమిత బైజు, రవీనా టాండన్‌, రాధిక శరత్‌కుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి, కూర్పు: నవీన్‌ నూలి, కళా దర్శకుడు: బంగ్లాన్‌,
ఫైట్‌ మాస్టర్‌: వి.వెంకట్‌, కొరియోగ్రాఫర్‌: విజరు బిన్నీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యలమంచిలి గోపాలకష్ణ, లైన్‌ ప్రొడ్యూసర్‌: ఉమామహేశ్వరరావు, సమర్పణ: శ్రీకర స్టూడియోస్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -