- Advertisement -
నవతెలంగాణ అచ్చంపేట
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో అచ్చంపేట నియోజకవర్గంలో అధికంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం పట్ల శనివారం హైదరాబాదులోని గాంధీభవన్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. అచ్చంపేట నియోజకవర్గంలో 174 సర్పంచులకు గాను 127 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించామని మహేష్ కుమార్ కు ఎమ్మెల్యే వంశీకృష్ణ వివరించారు. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫలితాలు ఇదే విధంగా ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట వెంకట్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
- Advertisement -



