Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోపూర్ లో మొదటి సాధారణ సమావేశం నిర్వహించిన పాలకవర్గం

సోపూర్ లో మొదటి సాధారణ సమావేశం నిర్వహించిన పాలకవర్గం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని సోపూర్ జిపి గ్రామంలో సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొలువుదీరిన నూతన గ్రామపంచాయతీ పాలకవర్గం మొదటి సాధారణ సమావేశం జిపి కార్యదర్శి అశోక్ రాథోడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా జిపి కార్యదర్శి మాట్లాడుతూ.. కొత్తగా కొలువుదీరిన జిపి కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానించి, మొదటి సాధారణ సమావేశం నిర్వహించి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు గ్రామ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించి గ్రామ అభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని కార్యదర్శి కోరారు.

అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్తులు నమ్మకంతో నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా నిజాయితీగా పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా కొలువుదీరిన జిపి పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -