- Advertisement -
వతెలంగాణ- దర్పల్లి
మండల కేంద్రములోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ గురువారం సందర్శించారు. ఈసందర్బంగా చిన్నారులకు నూతన సంవత్సరం రోజు పోరస్కరించుకొని విద్యార్థులకు నూతన యూనిఫామ్ లు పంపిణి చేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి రోజు విద్యార్థులకు అందించే పౌష్టిక ఆహారంతో పాటు బాలామృతం అందించే విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. కార్యక్రమములో ఊసర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు అజయ్, చెలిమేల రాములు, అంగన్వాడీ టీచర్ మరిపెద్ది జ్యోతి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.
- Advertisement -



