- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు రేపు ( జనవరి 3న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. కొండగట్టులో 96 గదుల సత్రాల నిర్మాణ స్థలానికి పవన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో భద్రతా, సౌకర్యాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
- Advertisement -



