- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉద్యోగం కోసం కువైట్ వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ కైలాశ్ (30) ఎడారిలో శవమై తేలాడు. మార్చి 19న జేసీబీ రిపేర్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కైలాశ్ చనిపోవడంతో, భయపడిన యజమాని అతడి మృతదేహాన్ని సాల్మి ఎడారిలో పూడ్చి పెట్టినట్లు కువైట్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. కైలాశ్ అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కువైట్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు ఇటీవల స్వగ్రామానికి వచ్చినట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -



