బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ మూవీ ‘సర్దార్ సర్వాయి పాపన్న’. ఈ సినిమాను వి.జి.మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ యానిమేషన్ మూవీ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ,‘సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని మా ఆర్కే ఫిలింస్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడిన వీరుడు సర్దార్ పాపన్న. బడుగు, వెనకబడిన కులాల వారిని ఒక్కటి చేసి పోరాడం సాగించాడు, 30 కోటలను జయించాడు. గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశాడు. అలాంటి ధీరుడిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి’ అని అన్నారు. ‘పాపన్న గురించి అనేక గ్రంథాల్లో సమాచారం సేకరించి ఈ సినిమాను రూపొందించాను. ‘బాహుబలి’లా మా సినిమా కూడా అలాంటి భారీ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా’ అని దర్శక, నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి చెప్పారు. హీరోయిన్ పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ,‘ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ వేడుకలో ప్రదర్శించారు. ఆ సీన్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. సినిమా కూడా ఇలాగే మనందరికీ నచ్చేలా ఉంటుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు.
‘బాహుబలి’లాంటి సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



