Tuesday, August 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొత్త రవితేజని చూస్తారు

కొత్త రవితేజని చూస్తారు

- Advertisement -

హీరో రవితేజ నటించిన కొత్త సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో మొత్తం మూడు లేయర్స్ ఉంటాయి. ఒకటి అయ్య ప్ప స్వామి మాల నేపథ్యం, అలాగే ఫ్యామిలీ, మరొకటి క్రైమ్ యాం గిల్. ప్రమోషన్స్ కూడా ఆ కంటెం ట్‌కు తగ్గట్టే ప్లాన్ చేసు కున్నాను. ఆ ప్లాన్ ప్రకారం ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చాము. ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి సినిమాలో ఏముందనేది ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చింది. ఇది చాలా యూనిక్ ఫిల్మ్ అని ప్రేక్షకులే చెప్తున్నారు. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. అయ్యప్ప స్వామిమాల నేపథ్యం, అందులో ఫ్యామిలీ, అలాగే కొత్త సెటప్. ఇలాంటి కథని రవితేజ లాంటి స్టార్ హీరోతో చేసినప్పుడు ఆ కథ ప్రతి ఇంటికి చేరుతుంది. ఈ కథ అనుకున్నప్పుడు ఎవరినీ మనసులో అనుకోలేదు.

కాకపోతే ఇది రవితేజకి చెప్పిన తర్వాత ఈ పాత్రకి పర్ఫెక్ట్‌గా సరిపోతారు అనిపించింది. ఆయన గడ్డం, ఆయన తేజస్సు ఈ పాత్రకి అద్భు తంగా సరిపోయాయి. ఇందులో సరికొత్త రవితేజని చూస్తారు. సీలేరు ప్రాంతంలో అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువగా పాడు కునే పాట ఏదని ఒక స్వామిని అడిగాను. ఆయన ‘మల్లెపూల పల్లకి’ పాట గురించి చెప్పారు. ఆ పాటతో షూటింగ్ చేశాము. 15 సంవత్సరాలుగా ఇది పడిపూజల్లో ప్రతి అయ్యప్ప భక్తులు పాడుకునే పాట. ఒరిజినల్‌గా పాట పాడిన డప్పు శ్రీనుతోనే పాడించాం. ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఈ చిత్రాలన్నీ కూడా మళ్లీ మళ్లీ చెప్పుకునేలాగా ఉంటాయి. గుర్తుం డి పోతాయి. ఇందులో కూడా క్రైమ్ యాంగిల్‌లో ఒక అద్భుతమైన కథ దొరికింది. మళ్ళీ మరో మంచి సినిమాతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -