Wednesday, August 19, 2026
E-PAPER
Homeఆటలుశ్రీకాంత్‌, గాయత్రికి ‘అర్జున ’

శ్రీకాంత్‌, గాయత్రికి ‘అర్జున ’

- Advertisement -

2025 క్రీడా పురస్కారాల ప్రకటన
నవతెలంగాణ-న్యూఢిల్లీ

తెలుగు తేజాలు ధనుష్‌ ‌శ్రీకాంత్‌, పుల్లెల గాయత్రి గోపీచంద్‌‌లు అర్జున అవార్డులు దక్కించుకున్నారు. గత నాలుగేండ్లుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ, పతకాలు సాధించిన క్రీడాకారులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడా పురస్కారాలకు ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ (‌విశ్రాంత) అరుణ్‌ ‌కుమార్‌ ‌మిశ్రా నేతృత్వంలోని కమిటీ క్రీడాకారులు, కోచ్‌‌లు, క్రీడా సంస్థలకు 2025 ఏడాదికి అవార్డులకు ప్రకటించింది. డెఫ్‌ఒలింపిక్స్‌‌లో పతకాలు కొల్లగొట్టిన పారా షూటర్‌, తెలంగాణ యువ కెరటం ధనుష్‌ ‌శ్రీకాంత్‌, బ్యాడ్మింటన్‌‌లో కేరళ అమ్మాయి ట్రెసా జాలి జతగా నిలకడగా రాణిస్తున్న జాతీయ బ్యాడ్మింటన్‌ ‌చీఫ్‌ ‌కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ‌తనయ గాయత్రిలు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. కామన్‌‌వెల్త్‌ ‌క్రీడల్లో మెడల్‌ ‌సాధించిన తేజస్విని శంకర్‌, చెస్‌ ‌ప్రపంచకప్‌‌లో విజేతగా నిలిచిన దివ్య దేశ్‌‌ముఖ్‌ ‌సైతం అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రతిష్టాత్మక ఖేల్‌‌రత్న పురస్కారం ఈసారి ఎవరికీ ఇవ్వలేదు.
అర్జున అవార్డులు : తేజస్విన్‌ శంకర్‌ (అథ్లెటిక్స్‌), మహ్మద్‌ అజ్మల్‌ (అథ్లెటిక్స్‌), ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్‌), ట్రెసా జాలి (బ్యాడ్మింటన్‌), పుల్లెల గాయత్రి గోపీచంద్‌ (‌బ్యాడ్మింటన్‌), నరేందర్‌ (‌బాక్సింగ్‌), విదిత్‌ ‌సంతోశ్‌ ‌గుజరాతీ (చెస్‌), దివ్య దేశ్‌ముఖ్‌ (‌చెస్‌), ధనుష్‌ ‌శ్రీకాంత్‌ (‌డెఫ్‌ ‌షూటింగ్‌), లాల్‌‌రెమిసియామి (హాకి), రాజ్‌‌కుమార్‌ ‌పాల్‌ (‌హాకి), సుర్జీత్‌ (‌కబడ్డీ), పూజ (కబడ్డి), రుద్రాన్షు ఖండేల్‌‌వాల్‌(‌పారా షూటింగ్‌), ఎక్తా బ్యాన్‌ (‌పారా అథ్లెటిక్స్‌), అర్వింద్‌ ‌సింగ్‌ (‌రోయింగ్‌), అఖిల్‌ ‌షియోరాన్‌ (‌షూటింగ్‌).

ద్రోణాచార్య అవార్డులు : పర్వీర్‌ ‌సింగ్‌ (అథ్లెటిక్స్‌), చోటె లాల్‌ ‌యాదవ్‌ (‌బాక్సింగ్‌), నేహా నందకుమార్‌ ‌చౌహాన్‌ (‌షూటింగ్‌). లైఫ్‌‌టైమ్‌ ‌విభాగంలో ధర్మేంద్ర సింగ్‌ ‌యాదవ్‌ (‌బాక్సింగ్‌), వీరెందర్‌ ‌కుమార్‌ (‌రెజ్లింగ్‌).

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -