నవతెలంగాణ-హైదరాబాద్ : యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటికి నేడు రాష్ర్ట ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు, దిగ్గజ క్రీడాకారిణి పి.టి ఉష ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదే సమయంలో ఎల్‌బి స్టేడియం ఆవరణలోని తెలంగాణ ఒలింపిక్ భవన్‌ను సైతం పిటి ఉష ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి చొరవతో ఇటీవల ఒలింపిక్ భవన్‌ను ఆధునీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుండగా..ఈ విషయాన్ని పిటి ఉష నేడు గచ్చిబౌలిలో జరిగే కార్యక్రమంలో ప్రకటించనున్నారు. స్పోర్ట్స్ యూనివర్శిటీకి గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో శంకుస్థాపన జరుగనుండగా, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, క్రీడాకారులు, కోచ్‌లు, ఒలింపిక్ సంఘం సభ్యులు తదితరులు హాజరుకానున్నారు.
నేడు స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



