నవతెలంగాణ – న్యూఢిల్లీ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఫొటో గ్రాఫర్ రఘు రాయ్ (83) ఆదివారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన వయో సంబంధిత సమస్యలతోనూ, క్యాన్సర్ పడుతున్నారు. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఆయన కుమారుడు నితిన్ రాయ్ వెల్లడించారు. ‘నాన్నకు రెండు సంవత్సరాల క్రితం ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కానీ ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్ కడుపుకి వ్యాపించింది. అయినా కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ మెదడు సోకింది. దీనికితోడు వయసు సంబంధిత అనారోగ్య సమస్యలు రావడంతో ఆయ మృతి చెందారు` అని నితిన్ రాయ్ మీడియాకు వెల్లడించారు. కాగా, రఘు రాయ్ 1942లో ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్లో ఝాంగ్లో జన్మించారు. ఆయన 1962లో ఫోటోగ్రాఫర్ అయ్యారు. తాను ఫొటోగ్రఫీని తన అన్నయ్య ఎస్. పాల్ వద్ద నేర్చుకున్నారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత ఫొటో గ్రాఫర్ రఘు రాయ్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



