Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమ్మాయిలు చదువుతోనే ఉన్నత స్థానాలు 

అమ్మాయిలు చదువుతోనే ఉన్నత స్థానాలు 

- Advertisement -

ఎన్.భారతమ్మ టీచర్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

అమ్మాయిలు చదువులో ముందంజలో ఉండడంతోనే ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు నోముల భారతమ్మ అన్నారు. ఆలేరు ఎస్ ఎఫ్ ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు పట్టణ కేంద్రం లోని వి.ఆర్.జూనియర్ కళాశాల లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పోటీ లకు  న్యాయనిర్ణేతలుగా ఉపాధ్యాయురాలు వడ్డెమాను రాణి లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థిని లు ప్రత్యేక శ్రద్ధ తో ఆత్మ విశ్వాసం తో చదువుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలి అని ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ను విద్యకు ఉపయోగ పడేలా వినియోగించాలని రానున్న కాలంలో మహిళలే ఎక్కువ ఉద్యోగాలు సాధించాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో వి. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప ఎస్ ఎఫ్ ఐ మండల అధ్యక్షులు పుట్టల సాగర్, కార్యదర్శి కాసుల నరేష్ఉ,పాధ్యక్షులు మద్దెల సాయి గణేష్,సభ్యులు కంతి రాజ్ కుమార్,  నాని కళాశాల అధ్యాపకులు ఉప్పలి రాజు,పరుశరాములు,మానస,మధుసూధన్, కమలాకర్,సునంద,వీరచారీ, ఉప్పాచారీ, క్రిష్ణ కుమార్,రమేష్,ఇందిర,జాస్మిన్,సుబాష్ సింధు,నర్మద ముగ్గులు వేసిన విద్యార్థినులు పబ్బోజు మమత,జంగ ప్రవళిక,ఆలేటి రంజిత,కొండోజు శృతి, మీడిదొడ్డి భార్గవి,కొమ్మరాజుల దీక్షిత, పర్రె ప్రణీత,శ్యామల సౌమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -