Monday, April 27, 2026
E-PAPER
Homeజాతీయంఅల్విదా రఘురాయ్‌

అల్విదా రఘురాయ్‌

- Advertisement -

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఫొటోగ్రాఫర్‌కు కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ :
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఫొటో గ్రాఫర్‌ రఘురాయ్‌ (83) ఆదివారం కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా ఆయన వయో సంబంధిత సమస్యలతోనూ, క్యాన్సర్‌ పడుతున్నారు. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఆయన కుమారుడు నితిన్ రాయ్‌ వెల్లడించారు. ‘నాన్నకు రెండు సంవత్సరాల క్రితం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. కానీ ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆ తర్వాత క్యాన్సర్‌ కడుపుకి వ్యాపించింది. అయినా కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం క్యాన్సర్‌ మెదడు సోకింది. దీనికితోడు వయసు సంబంధిత అనారోగ్య సమస్యలు రావడంతో ఆయ మృతి చెందారు అని నితిన్‌ రారు మీడియాకు వెల్లడించారు.కాగా, రఘు రారు 1942లో ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్లో ఝాంగ్లో జన్మించారు. ఆయన 1962లో ఫోటోగ్రాఫర్‌ అయ్యారు. తాను ఫొటోగ్రఫీని తన అన్నయ్య ఎస్‌. పాల్‌ వద్ద నేర్చుకున్నారు. ఆయన తీసిన చిత్రాలు సమాజాన్ని కదిలించాయి.రఘురారు అంత్య క్రియలు నిర్వహించగా,…సహచరులు, బంధువులు, కన్నీటి వీడ్కోలు పలికారు.
రఘురాయ్‌ మరణం పట్ల టీఎస్‌పీజేఏ సంతాపం
ప్రఖ్యాత ఫోటో జర్నలిస్ట్‌ రఘురాయ్‌ మరణం పత్రికా రంగానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం (టీఎస్‌పీజేఏ) పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.గంగాధర్‌, కె.ఎన్‌.హరి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఫోటో జర్నలిజానికి ఆయన మార్గదర్శిగా నిలిచారని నివాళులర్పించారు. దశాబ్దాల పాటు దేశ చరిత్రను నమోదు చేసిన ఛాయాచిత్ర నిపుణులుగా ఆయన అందరి మనస్సుల్లోనూ నిలిచిపోతారని పేర్కొంటూ సంతాపం వెలిబుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -