Monday, April 27, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్ రెండో విడ‌త పోలింగ్‌..నేటితో ముగియ‌నున్న ప్ర‌చారం

బెంగాల్ రెండో విడ‌త పోలింగ్‌..నేటితో ముగియ‌నున్న ప్ర‌చారం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పంచ‌తంత్ర ఎన్నిక‌ల సంగ్రామం తుది ద‌శ‌కు చేరుకుంది. ఏప్రిల్ 9న కేర‌ళ‌, అసోం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ జ‌రగ్గా 23న త‌మిళ‌నాడులో ఒకే ద‌ఫాలో ఎన్నిక‌లు ముగియ‌గా, బెంగాల్‌లో తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రిగాయి. 16 జిల్లాల్లో 152 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. 93 శాతం ఓటింగ్ నమోదైంది. ఈనెల 29న సెకండ్ ఫేజ్‌లో 142 నియోజకవర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈక్ర‌మంలో బెంగాల్‌లో నేటితో రెండో విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు మూగ‌బోనున్నాయి. బెంగాల్‌లో అధికార ప‌క్షం టీఎంసీ ప్ర‌చారంలో దూకుడు పెంచ‌గా, సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌తో సీపీఐ(ఎం) ప్ర‌చారాన్ని హోరెత్తించింది. ఎన్డేయే కూట‌మి విస్తృతంగా రోడ్ షోలు నిర్వ‌హించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -