నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి రాబోతుంది. ఈ మ్యాచులో భారీ స్కోర్ చేసి ఆర్సీబీపై మరో విజయం నమోదు చేసుకోవాలని డీసీ చూస్తుండగా, గత మ్యాచులో ఓడించిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు జట్టు ప్లాన్ వేసింది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: సాహిల్ పరాఖ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), దుష్మంత చమీరా, కైల్ జామీసన్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్



