– సీపీఐ (ఎం)నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రపంచ శ్రామిక దినం మే ఒకటిన నిర్వహించే మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పార్టీ శ్రేణులు కు పిలుపునిచ్చారు. మండలంలోని కోయరంగాపురం పంచాయితి గుంటిమడుగు లో మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడే తో పాటు మే 19 న సుందరయ్య వర్ధంతి సభలను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం సీపీఐ(ఎం) స్థానిక నాయకులు వర్షా అర్జున్ – కౌసల్య కుమార్తెలు శ్రావణి,స్రవంతి ఓణీ ల వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. అదే గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు ఆసి సీతారాముల ప్రమాదానికి గురై గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న క్రమం ఆయన్ను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, కమిటీ సభ్యులు ముల్లగిరి గంగరాజు,తుట్టి వీరభద్రం, మురళి లు పాల్గొన్నారు.



