Monday, April 27, 2026
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి

- Advertisement -

– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 
నవతెలంగా – అశ్వారావుపేట

మండలంలోని తిరుమలకుంటలో సోమవారం నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టడం ద్వారా దిగుబడులు పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. ముఖ్యంగా తక్కువ యూరియా వినియోగంతో పంటలను సాగు చేయడం, నీటి యాజమాన్యంపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవడం, సమతుల్య ఎరువుల వినియోగం, నాణ్యమైన విత్తనాల ఎంపిక, అవసరమైన క్రిమిసంహారక మందుల సరైన వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు సాధించగలరని, శాస్త్రవేత్తల సూచనలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు. రైతు ముంగిటకే శాస్త్రవేత్తలను తీసుకువచ్చి ప్రత్యక్ష అవగాహన కల్పించడం ప్రభుత్వ రైతు పక్షపాత దృక్పథానికి నిదర్శనమని తెలిపారు.

అనంతరం అశ్వారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ (బీఎఫ్ఏసీ)చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, స్థానిక సర్పంచ్ కె.రాజేష్, రెడ్డిగూడెం సర్పంచ్ వెంకటరమణ, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు పి. రామ లక్ష్మయ్య, ఎంపీడీవో బి. అప్పారావు, అగ్రికల్చర్ కాలేజ్ డీన్ హేమంత్ కుమార్, అగ్రికల్చర్ ఏడీ రవికుమార్, అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -