నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలో జరిగిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 84 మందికిగా గాయాలయ్యాయి అని రైలు నిర్వహణ సంస్థ మంగళవారం తెలిపింది. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి శిథిలాల కింద వారిని బయటకు తీశారు. జకార్తాకు సమీపంలోని బెకాసిలో సోమవారం రాత్రి ఒక ప్రయాణీకుల రైలు, ఒక సుదూర ప్రాంత రైలు (సిటీ రైలు) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై ఇండోనేషియా ప్రభుత్వ రైల్వే సంస్థ పీటీ కేఏఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి బాబీ రషీదిన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. ప్రయాణీకుల రైలు మొదట పట్టాలపై ఉన్న టాక్సీని ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ రైలును సుదూర ప్రాంత రైలు రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు పెరిగిందని తెలిపారు. మహిళలు మాత్రమే ప్రయాణించే బోగీ ఈ ప్రమాదంలో తీవ్రంగా దెబ్బతింది. బాధితులందరూ మహిళలే. ఆ బోగీల్లో నుజ్జునుజ్జయిన ఇనుప కడ్డీల కింద మహిళల మృతదేహాలున్నాయి. రెస్క్య సిబ్బంది రైళ్లను విడదీయడానికి ముందు, యాంగిల్ గ్రైండర్లను ఉపయోగించి కంపార్ట్‌మెంట్ల లోహాన్ని కోసి, ప్రాణాలతో ఉన్నవారిని బయటకు తీశారు. మంగళవారం మృతుల బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని వారి బంధువులకు సంబంధించిన మృతదేహాలను వెతుకున్నారని పోలీసులు తెలిపారు.
కాగా ఈ ఘటనపై అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తారని ఆయన తెలిపారు. రైలు నెట్‌వర్క్‌లోని చాలా భాగాలు సరిగా నిర్వహించబడటం లేనందు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడంలో సహాయపడటానికి రైలు పట్టాల సమీపంలో ఒక ఫ్లైఓవర్ నిర్మించడానికి తాను అంగీకరించానన్నారు. ఈ ప్రమాదంపై ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ (కెఎన్‌కెటి) దర్యాప్తు చేస్తోంది.
ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష చర్చల వల్ల లెబనాన్‌కు ఫలితాలు లేనట్లే ఉన్నాయి. ఈ చర్చలతో మాకెలాంటి సంబంధం లేదు. లెబనాన్, ఆ దేశ దాని ప్రజల కోసం మేము మా రక్షణాత్మక ప్రతిఘటనను కొనసాగిస్తాము అని నజీమ్ ఖాసిమ్ ప్రకటనలో పేర్కొన్నారు. శత్రువు ఎంత బెదిరించినా మేము వెనకడుగు వేయము. తలవంచము, ఓటమిని అంగీకరించము అని ఆయన ఇజ్రాయిల్ చర్యలపై ధీటుగా స్పందించారు.



