Sunday, June 28, 2026
E-PAPER
Homeజాతీయంమొహర్రంలో విషప్రయోగం కుట్ర భగ్నం

మొహర్రంలో విషప్రయోగం కుట్ర భగ్నం

- Advertisement -

వతెలంగాణ – హైదరాబాద్ : ముంబయిలో మొహర్రం సందర్భంగా దాదాపు 15,000 మందికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేయాలన్న కుట్రను ఓ మహిళ అప్రమత్తతతో పోలీసులు భగ్నం చేశారు. రేయ్ రోడ్ రహ్మతాబాద్ శ్మశానం వద్ద ఫయాజ్ ప్రేమ్‌జీ అనే వ్యక్తి ఉచితంగా తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లంటూ క్యాప్సూల్స్ పంచాడు. ఆ తర్వాత ‘చాక్లెట్లు’ అని చెప్పి జనాలపైకి విసిరాడు. వాటిపై అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. బైకుల్లా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని జింక్ పాస్ఫేట్ కలిగిన 14,900 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తీసుకుని అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -