- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశంలోని ప్రముఖ తీరప్రాంత పారిశ్రామిక నగరం ‘రాస్ తానూరా’ సమీపంలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గురైన సదరు హెలికాప్టర్.. ప్రపంచంలోనే అతిపెద్ద సౌదీ చమురు దిగ్గజ సంస్థ అయిన ‘సౌదీ అరామ్కో’ కు చెందినదిగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
- Advertisement -



