నవతెలంగాణ-నెల్లికుదురు
మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పల్స్ పోలియో 94% పూర్తి అయ్యిందని స్థానిక వైద్యాధికారి డాక్టర్ రమ్య తెలిపారు. పల్స్ పోలియోను పురస్కరించుకొని వైద్య సిబ్బంది సహకారంతో ఆదివారం ప్రతి గ్రామంలో పోలయో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలుసు పోలియో జీరో నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా పలుసుపోలేను వేయించుకోవాలని అన్నారు అలా చేసినట్లయితే ఏ ఒక్కరికి కూడా పోలియో వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు మన మండలాన్ని పోలియో రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. మా వైద్య సిబ్బందితో మండలంలోని అన్ని గ్రామాలలో తండాలలో పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సిబ్బందితో నిర్వహించామని అన్నారు . ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
94 శాతం పల్స్ పోలియో పూర్తి: డా. రమ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



