- Advertisement -
నవతెలంగాణ-మిడ్జిల్
ఈ నెల 30న మాజీ సర్పంచ్ రాధిక భర్త వెంకరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా వెంకరెడ్డి విగ్రహావిష్కరణకు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వస్తున్నట్లు మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోనీ అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు, సర్పంచులు, ఉపసర్పంచులు, తరలి రావాలని కోరారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు హాజరు హాజరవుతున్నట్టు మాజీ జడ్పీటీసీ శశి రేఖా బాలు, నాయకులు జంగారెడ్డి, జైపాల్ రెడ్డి, గంజి కృష్ణ సర్పంచ్ లు శ్రీనివాస్ గౌడ్, గోపాల్ ముదిరాజ్ లు తెలిపారు.
- Advertisement -



