Sunday, August 9, 2026
E-PAPER
Homeక్రైమ్ఎద్దులబండిని ఢీకొన్న ద్విచక్ర వాహనం

ఎద్దులబండిని ఢీకొన్న ద్విచక్ర వాహనం

- Advertisement -

అక్కడికక్కడే యువకుడు మృతి
నవతెలంగాణ-మిడ్జిల్ 

ఎద్దుల బండిని ద్విచక్ర వాహనం ఢీ కొట్టి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జడ్చర్ల-కల్వకుర్తి 167 జాతీయ రహదారిపై రాణిపేట్ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోయినపల్లి గ్రామానికి చెందిన బన్నీ (21) జడ్చర్ల మండలంలోని పోలేపల్లి కంపెనీలో విధులు ముగించుకొని ఆదివారం తెల్లవారుజామున తన స్వగ్రామం బోయిన్పల్లికి తిరిగి వస్తుండగా.. మున్ననూర్ గ్రామ శివారులో చిల్వేర్ గ్రామానికి చెందిన మల్లయ్య ఎద్దులబండిని బైక్ ఢీకొట్టింది. దీంతో బన్నీ తలకు బలమైన గాయమై, అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది ఘటనా స్థలిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వాస్పత్రి తరలించి, పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -