నవతెలంగాణ-తుంగతుర్తి
పిల్లల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉండాలంటే పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి తల్లిదండ్రులు భాగస్వాములు కావాలని గానుగుబండ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ అన్నారు.ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని స్వయంగా పల్స్ పోలియో చుక్కలు వేసి మాట్లాడారు.ఈ మేరకు పోలియో రహిత సమాజమే మన లక్ష్యమని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.పోలియో ఒక ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ పోలియో చుక్కల ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చన్నారు.అందరి సహకారంతోనే పోలియో రహిత,ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని ప్రతి చిన్నారి ఆరోగ్యం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లావణ్య మధుసూదన్,ఏఎన్ఎం నాగలక్ష్మి,ఆశా కార్యకర్త ఎనగందుల రమ తదితరులు పాల్గొన్నారు.
పోలియో రహిత సమాజమే లక్ష్యం: సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



