- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కైల్ జేమీసన్‌కు ఐపీఎల్ వార్నింగ్ ఇచ్చింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసిన తర్వాత జేమీసన్ ఆవేశంతో ఊగిపోయాడు. బ్యాటర్ వద్దకు అరుచుకుంటూ మీదకు వెళ్లాడు. వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన జేమీసన్ వైఖరిపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అతనికి డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ రెండో ఓవర్‌లోనే ఈ ఘటన చోటుచేసుకున్నది.
- Advertisement -



