Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త ఫాంటసీ ఎంటర్ టైనర్

సరికొత్త ఫాంటసీ ఎంటర్ టైనర్

- Advertisement -

గత కొన్నేళ్లుగా విభిన్న పాత్రలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో అల్లరి నరేష్ ఇప్పుడు తన మార్క్ కామెడీ జోనర్‌ లో రూపొందుతున్న ‘రంభ ఊర్వశి మేనక’తో సిద్ధమయ్యారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కామెడీ గోస్ టు కాస్మిక్` ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ వినోదంతో మేళవించిన వినూత్న కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా మ్యూజికల్ జర్నీకి శ్రీకారం చుడుతూ మేకర్స్ తొలి పాట ‘నా కంటి మీద కునుకే’ను విడుదల చేశారు. అల్లరి నరేష్, సురభిపై చిత్రీకరించిన ఈ పాట సినిమాలోని రొమాంటిక్ కోణాన్ని పరిచయం చేస్తూనే, గ్రామీణ నేపథ్యంలో సాగే కథకు అందమైన అనుభూతిని అందిస్తోంది. దర్శకుడు చైతన్ భరద్వాజ్ గ్రామీణ సంగీతపు మాధుర్యాన్ని మోడరన్ ఆర్కెస్ట్రేషన్‌తో మేళవిస్తూ హాయిగా సాగే మెలోడీని అందించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం ప్రేమలోని మధురమైన భావాలను అందంగా ఆవిష్కరించగా, ధనుంజయ్ సీపాన తన వోకల్స్ తో పాటకు మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చారు. జిత్తు మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ, అందమైన లొకేషన్స్‌తో కలిసి కనుల విందుగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -