Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుశక్తివంతమైన కథతో 'మారెమ్మ`

శక్తివంతమైన కథతో ‘మారెమ్మ`

- Advertisement -

హీరో రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న విలేజ్ యాక్షన్-డ్రామా సినిమా ‘మారెమ్మ’. ఈ చిత్ర నిర్మాతలు సినిమా థియేట్రికల్ రిలీజ్ తేదీని ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. కొత్తగా విడుదలైన పోస్టర్‌లో మాధవ్ యుద్ధంలో పోరాడి వచ్చినట్టుగా ఇంటెన్స్ అవతార్‌లో ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌లో ఆయన పాత్రలోని రా ఇంటెన్సిటీతో పాటు భావోద్వేగాలను బలంగా చూపించారు. హీరోకు, పవిత్రమైన ఆవుకు మధ్య కనిపించే పేస్ అఫ్, ఈ సినిమా కథా నేపథ్యాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేస్తోంది. ఈ చిత్రంతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు, ఇటీవల విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో మేకర్స్ విజయవంతమయ్యారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, బలమైన భావోద్వేగాలతో మేళవించిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -