Wednesday, August 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్షకులకు కృతజ్ఞతలు

ప్రేక్షకులకు కృతజ్ఞతలు

- Advertisement -

హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమా తన ప్రస్థానాన్ని విజయ వంతంగా కొనసాగిస్తోంది. ఈ ఏడాది హిందీ చిత్రాల్లో అత్యంత భారీ విదేశీ విడుదలల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, 59 దేశాల్లో 804 స్క్రీన్‌లపై విడుదలైంది. హిందీ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం విశేషం. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందన నేపథ్యంలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ హైదరాబాద్‌కు వచ్చి ప్రేక్షకులను కలుసుకున్నారు. తమ సినిమాను ఇంతగా ఆదరించి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ సినిమా, ప్రేక్షకుల నోటి మాట ప్రచారంతో ఇప్పుడు ఈ ఏడాది అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -